Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్‌సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు విశ్వక్ సేన్ (Vishwak sen). తాజాగా ఆయన ఇండస్ట్రీలో అణచివేత అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో అణచివేత ఉంటుందా అనే ప్రశ్నకు కథానాయకుడు విశ్వక్‌సేన్ (Vishwak Sen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్టు లేదా ఫ్లాప్ అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ‘‘మీరు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు కానీ, వచ్చిన తర్వాత కానీ ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలనుకున్నారా?’’ అని విలేకరి ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని చెప్పారు.
‘‘నాకు అయితే అలా ఎప్పుడూ అనిపించలేదు. కొన్ని సందర్భాల్లో అనిపించింది కానీ అది నిజమో కాదో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని విలన్‌గా అనుకుంటాం. తీరా చూస్తే, మనం అనుకున్న వాళ్లు కాకుండా వేరే వాళ్లు విలన్స్ అవుతారు. దీనివల్ల నేను ఎప్పుడూ ఆ విషయంపై అంత ఫోకస్ పెట్టలేదు. సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే సరిపోయింది. సినిమా చేసిన తర్వాత హిట్టు లేదా ఫ్లాప్ అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనల్ని తొక్కేయాలనుకుంటే.. వాళ్లే తొక్కాలి. సినిమా సరిగ్గా తీయకపోతే వాళ్లే తొక్కేస్తారు’’ అని విశ్వక్ తెలిపారు.
ఇక, విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన స్వీయ దర్శకత్వం వహించారు. నివేథా పేతురాజ్ కథానాయిక. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 22న ఇది విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్
-
Sports News
WTC Final: భారత్ గోల్డెన్ అవర్‌ను చేజార్చుకొంది: పాంటింగ్