Viswambhara: ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు.
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలోనూ విరామానికి ముందు వచ్చే ఓ పోరాట ఘట్టానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని విధంగా ఆ పోరాట ఘట్టాన్ని 26 రోజులు చిత్రీకరించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో చిరంజీవి, పలువురు ఫైటర్లపై ఈ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ పోరాట ఘట్టం కోసమే ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్.ప్రకాశ్ నేతృత్వంలో 54 అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహంతోపాటు, ఓ ప్రత్యేకమైన సెట్‌ని తీర్చిదిద్దారు. ‘‘ఒక్క పోరాట ఘట్టం కోసం 26 రోజులు కేటాయించడం చిరంజీవి కెరీర్లో ఇదే ప్రథమం. ఎంతో ప్రత్యేకతతో కూడిన ఈ సన్నివేశాల చిత్రీకరణ సోమవారంతో పూర్తయింది. ఇవి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫాంటసీ ప్రపంచం చుట్టూ సాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్‌తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.