war 2 ott release: అఫీషియల్‌: ఓటీటీలో ‘వార్‌2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Eenadu icon
By Entertainment Team Updated : 08 Oct 2025 14:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ప్రేక్ష‌కులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన భారతీయ సినిమాల్లో ‘వార్ 2’ (War2 Movie) ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ ఫ్రాంఛైజీలో ఎన్టీఆర్ (NTR), హృతిక్‌ రోషన్‌లు నటించారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఆగస్టులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఓటీటీలో వస్తే చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) శుభవార్త చెప్పంది. అక్టోబరు 9వ తేదీ (war 2 ott release date) నుంచి ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం (War2 Director) వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

ఇంతకీ కథేంటంటే..

రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశం దృష్టిలో ఓ ద్రోహి. రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)కి ఒకప్పుడు నమ్మిన బంటు. అలాంటి కబీర్ రా కళ్లుగప్పి అజ్ఞాతంలో గడుపుతుంటాడు. ఓ కాంట్రాక్ట్‌లో భాగంగా జపాన్‌లో అత్యంత శక్తిమంతమైన ఓ వ్యక్తిని అంతం చేస్తాడు. ఆ తర్వాత అతనిపై కలి కార్టెల్ అనే ఓ అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్నేస్తుంది. కబీర్‌ని తన కార్టెల్‌లో భాగం చేసుకుని భారతదేశాన్ని గుప్పెట్లోకి తీసుకోవాలనేది కలి పన్నాగం. ఆ కార్టెల్ మొదట కబీర్‌కి ఓ టాస్క్ అప్పజెబుతుంది. తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రాని అంతం చేయాలనేదే ఆ టాస్క్. చెప్పినట్టే ఆ పనిని పూర్తి చేస్తాడు కబీర్. దాంతో కబీర్‌ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ బృందాన్ని రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఒకరు. మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది? కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతనికీ, కావ్యకీ ఉన్న సంబంధం ఏమిటి? కబీర్... లూథ్రాని చంపడం వెనక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? కలి కార్టెల్ వెనకున్న అజ్ఞాత శక్తులు ఎవరు? అన్నది చిత్ర కథ!

(పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


Tags :
Published : 08 Oct 2025 14:10 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు