Kangana Ranaut: చివరి తరంలో స్టార్స్‌ మేమే

‘‘చిత్రపరిశ్రమలో హిట్స్‌ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్‌లో హిట్‌ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కంగనా రనౌత్‌.

Updated : 29 Mar 2024 11:51 IST

‘‘చిత్రపరిశ్రమలో హిట్స్‌ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్‌లో హిట్‌ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కంగనా రనౌత్‌. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. సినీరంగంలో సరైన విజయాల్ని అందుకోకపోవడం వల్లే పాలిటిక్స్‌లోకి వెళ్లారంటూ వస్తోన్న వార్తలపై స్పందించింది కంగన. ‘ఈ ప్రపంచంలో కేవలం విజయాన్ని మాత్రమే అందుకున్న నటులు లేరు. అగ్రకథానాయకుడు షారుక్‌ ఖాన్‌కు ‘పఠాన్‌’కు ముందు దాదాపు 10 సంవత్సరాలు వరకూ హిట్లు లేవు. . సినీరంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో నేను కూడా పరాజయాలతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. తరవాత ‘క్వీన్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘మణికర్ణిక’ ముందు నాలుగేళ్లు నేను ఎలాంటి హిట్‌ సినిమాలు తీయలేదు. ఇటీవల నేను నటించిన ‘తేజస్‌’ ఫ్లాప్‌ అయ్యింది. త్వరలో ‘ఎమర్జెన్సీ’ రాబోతుంది. దీంతో పాటు ఓటీటీలు కూడా నటీనటులకు మంచి అవకాశాల్ని ఇస్తున్నాయి. కానీ.. ఓటీటీ నటీనటులను స్టార్స్‌గా తీర్చిదిద్దలేదు. నాకు తెలిసి మేమే చివరి తరం స్టార్స్‌ అని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది కంగన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని