Rakul Preet Singh: పెళ్లి అయ్యాక ఇలాంటి దుస్తులే ధరించాలని అబ్బాయికి చెప్పగలరా?: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (rakul Preet Singh). తాజాగా ఆమె ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు.

Published : 21 Mar 2024 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వివాహం తర్వాత తొలిసారి ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh). ముంబయి వేదికగా జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2024లో ఆమె షో టాపర్‌గా ర్యాంప్‌పై హొయలొలికించారు. ఈవెంట్‌ అనంతరం  మీడియాతో మాట్లాడుతూ.. రితికా మిర్చందానీ కలెక్షన్స్‌ ధరించి షోలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇందులోభాగంగా పలువురు విలేకరులు.. ‘‘మీరు కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కదా. డ్రెస్సింగ్ స్టైల్‌లో మార్పులు చేసుకోమని ఇంట్లో వాళ్లు ఏమైనా సూచించారా?’’ అని ప్రశ్నించారు.

‘‘అలాంటిది ఏమీ లేదు. నా కుటుంబసభ్యులు, జాకీ ఫ్యామిలీ విషయంలో ఎంతో సంతోషం, గర్వంగా ఉన్నా. మన సమాజంలో పెళ్లిని చాలా పెద్ద విషయంగా చూస్తుంటాం. కానీ, ఎవరి జీవితంలోనైనా అది సహజమైన ప్రక్రియ. పెళ్లయ్యాక ఓ అబ్బాయికి ఇలాంటి దుస్తులే ధరించమని చెప్పగలమా? లేదు కదా. కాలం మారింది. ఎవరికి నచ్చినవిధంగా వారు జీవిస్తున్నారు’’ అని రకుల్‌ అన్నారు.

ముంబయిలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా మార్చి 13 నుంచి 17 వరకూ ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’ జరిగింది. బాలీవుడ్‌కు చెందిన జాన్వీకపూర్‌, అనన్య పాండే, త్రిప్తి డిమ్రి, తాప్సీ, సారా అలీఖాన్‌, శ్రుతిహాసన్‌ చాలామంది సినీ తారలు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. రితికా డిజైన్‌ చేసిన బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో రకుల్‌ ర్యాంప్‌పై నడిచారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. నిర్మాత జాకీ భగ్నానీతో గత నెలలో ఆమెకు వివాహం జరిగింది. గోవా వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని