Jyotika: జ్యోతిక.. సూర్యను నాకు ఇస్తారా: నెటిజన్‌ కామెంట్‌పై నటి ఏమన్నారంటే..?

‘సైతాన్‌’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు నటి జ్యోతిక (Jyotika). ఆమె పెట్టిన పోస్ట్‌పై ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌ వైరల్‌గా మారింది.

Published : 22 Mar 2024 12:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘నువ్వు నేను ప్రేమ’లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు సూర్య, జ్యోతిక. ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వారు భార్యాభర్తలుగా కనిపించారు. ఇందులోని ఓ సన్నివేశంలో జ్యోతిక తన భర్తను.. ఒక్కరోజుపాటు ఆయన మాజీ ప్రియురాలు వద్దకు పంపిస్తుంది. ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ తాజాగా ఓ యువతి జ్యోతికకు పోస్ట్‌ పెట్టింది.

‘సైతాన్‌’ (Shaitaan) సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు నటి జ్యోతిక (Jyotika). చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ గురువారం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘మేడమ్‌.. ‘నువ్వు నేను ప్రేమ’లో మాదిరిగా సూర్యను ఒక్కరోజు నాకు అప్పుగా ఇస్తారా? ఎందుకంటే 15 ఏళ్ల నుంచి ఆయనకు నేను వీరాభిమానిని’’ అని కామెంట్‌ పెట్టింది. ‘‘అది కుదరదు’’ అంటూ జ్యోతిక రిప్లై ఇచ్చారు. ఆమె నుంచి రిప్లై వచ్చేసరికి ఆ యువతి సంబరపడింది. ‘‘ఓ మై గాడ్‌.. ఆయన ఎప్పటికీ మీవారే’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని