Kamal Haasan: ఉత్తమ నటుడు కమల్‌హాసన్‌.. ఉత్తమ నటి కీర్తిసురేశ్‌

‘విక్రమ్‌’ సినిమాగానూ ఉత్తమ నటుడిగా కమల్‌ హాసన్‌, ‘సాని కాయితం’ చిత్రానికిగానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా నిలిచారు.

Updated : 26 May 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒసాకా తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (osaka tamil international film festival) విజేతల జాబితాను ప్రకటించారు. 2022లో విడుదలై, మెప్పించిన సినిమాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆ సంస్థ వెల్లడించింది. ‘విక్రమ్‌’ (Vikram) ఉత్తమ చిత్రంగా నిలిచింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఉత్తమ నటుడిగా, ‘సాని కాయితం’ చిత్రానికిగానూ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ఉత్తమ నటిగా నిలిచారు. ఉత్తమ దర్శకుడి పురస్కారానికి మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 1 చిత్రం), ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి అనిరుధ్‌ (విక్రమ్‌ సినిమా) ఎంపికయ్యారు.

అత్యధికంగా ‘విక్రమ్‌’ 8 విభాగాల్లో, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ (Ponniyin Selvan: I) 7 విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి. బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా ‘లవ్‌ టుడే’ (Love Today) సత్తా చాటింది. జపాన్‌ దేశంలోని ఒసాకా నగరం ఈ అవార్డుల వేడుకకు వేదికగా మారింది. ఈ ఈవెంట్‌ కోలీవుడ్‌, జపాన్‌ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలుస్తోంది. మరికొందరి విజేతల వివరాలివీ..

  • బెస్ట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: రవివర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 1)
  • బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్స్‌: రత్నకుమార్‌, లోకేశ్‌ కనగరాజు (విక్రమ్‌)
  • బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌: జానీ మాస్టర్‌ (అరబిక్‌ కుతు పాట: బీస్ట్‌)
  • బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: ఫహాద్‌ ఫాజిల్‌ (విక్రమ్‌)
  • బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌: ఐశ్వర్యా రాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 1)
  • బెస్ట్‌ విలన్‌: విజయ్‌ సేతుపతి (విక్రమ్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని