Kona Venkat: పాలిటిక్స్‌ ఎందుకని పవన్‌తో వాదించేవాణ్ని: కోన వెంకట్‌

ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు రచయిత కోన వెంకట్‌.

Published : 11 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తనకు మంచి స్నేహం ఉందని సినీ రచయిత కోన వెంకట్‌ (Kona Venkat) అన్నారు. పాలిటిక్స్‌ ఎందుకంటూ పవన్‌తో వాదించేవాడినని చెప్పారు. తాను కథ అందించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతులు పంచుకున్నారు.

‘‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసే సమయంలో ‘మనకెందుకు పాలిటిక్స్‌’ అని అడిగా. నీ అభిప్రాయం నీ వద్దే పెట్టుకో అని ఆయన సమాధానమిచ్చారు. తన ఒపీనియన్‌ చెబుతుంటే.. నేను వాదించేవాడిని. టాలీవుడ్‌లో ఆయన రారాజు. ఈ పరిశ్రమను వదులుకుని వందమందితో వంద మాటలు పడడం ఎందుకని నాకు అనిపించింది. చిరంజీవి కూడా పాలిటిక్స్‌లోకి వెళ్లి, మళ్లీ ఇండస్ట్రీకి వచ్చారు. హ్యాపీగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. కొందరికి రాజకీయం సరిపడదు. పవన్‌తో నాకు ఎప్పటినుంచో ఉన్న పరిచయంతో చెబుతున్నా.. ఆయన వ్యక్తిగతంగా ఎవరితోనూ పరుషంగా మాట్లాడడు. తను ఇంట్రోవర్ట్‌, సెన్సిటివ్‌’’ అని పేర్కొన్నారు. గతంలో.. అంజలి (Anjali) నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘గీతాంజలి’. విజయవంతమైన ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిందే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. సహ నిర్మాతగాను వ్యవహరించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని