Yami Gautam: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్‌.. పేరేంటంటే

నటి యామీ గౌతమ్‌ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Published : 20 May 2024 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి యామీ గౌతమ్‌ (Yami Gautam)‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త ఆదిత్యధర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ సంతోషకరమైన వార్తను షేర్‌ చేశారు. ఆ బాబుకు ‘వేదవిద్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘మరొక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. మా కుమారుడి గొప్ప భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నాం. అతడు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. మా కుటుంబానికి అలాగే దేశానికి గర్వకారణమయ్యేలా ఎదగాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్‌ చెబుతున్నారు. యామీ-ఆదిత్యధర్‌లు 2021లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్‌ గురించి ఈ సంగతులు తెలుసా?

టెలివిజన్‌లో ప్రకటనలతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి యామీ గౌతమ్‌ (Yami Gautam)‌. ‘నువ్విలా’తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత పలు బాలీవుడ్‌ సినిమాలతో హిట్‌ను అందుకున్నారు. అదే సమయంలో ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. ఇటీవల తాను నటించిన ‘ఆర్టికల్‌ 370’లాంచింగ్ ఈవెంట్‌లో తల్లికానున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు