Yash: యశ్‌ నిర్మాణంలో రామాయణం

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ కథానాయకుడు యశ్‌. ఇప్పుడాయన స్వీయ నిర్మాణంలో నమిత్‌ మల్హోత్రాతో కలిసి మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు.

Updated : 13 Apr 2024 11:50 IST

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ కథానాయకుడు యశ్‌. ఇప్పుడాయన స్వీయ నిర్మాణంలో నమిత్‌ మల్హోత్రాతో కలిసి మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఓ భారీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. అదే నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత యశ్‌ మాట్లాడుతూ.. ‘‘మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. నమిత్‌.. నేను రామాయణం చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్ట్‌ తీయాలంటే అది మామూలు విషయం కాదు. బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే నేను నమిత్‌తో కలిసి దీన్ని నిర్మించాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాను. దీనికి నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకు చూడని సినిమాటిక్‌ అనుభూతిని అందించేందుకు భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాం’’ అన్నారు మరో నిర్మాత నమిత్‌ మల్హోత్రా. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌.. సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. రావణుడి పాత్రను యశ్‌ పోషించనున్నట్లు తెలిసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు