Sunitha Kejriwal: నా భర్త జీవితం.. దేశానికే అంకితం: సునీతా కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేయడం ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ అన్నారు. 

Published : 23 Mar 2024 00:05 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టు కావడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal) స్పందించారు.  ప్రధాని మోదీ (PM Modi) తనకు అధికార ఉందన్న అహంకారంతో దిల్లీ ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘మూడుసార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని పీఎం మోదీ అరెస్టు చేయించారు. ప్రజలందరినీ ఆయన అణచివేయాలని చూస్తున్నారు. ఇది దిల్లీ ప్రజలకు ఆయన చేస్తున్న ద్రోహం. మీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నా.. బయట ఉన్నా.. ఎప్పుడూ మీతోనే ఉంటారు. ఆయన జీవితం దేశానికే అంకితం. ప్రజలే సర్వోన్నతం. ఆయనకు అన్నీ తెలుసు. జై హింద్‌’ అంటూ రాసుకొచ్చారు.

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం భారీ భద్రత నడుమ ఆయన్ను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్‌ కోరగా.. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు సీఎం అరెస్టుతో దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ కేసులో ఆయనకు రిమాండ్‌ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్‌ నేతలు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు