loksabha polls: ఖర్గేతో ఆప్‌ నేత సంజయ్ సింగ్ భేటీ

ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు.

Published : 14 Apr 2024 18:29 IST

దిల్లీ: ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతృత్వంలో మరో ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన ఖర్గేను కోరారు. సంజయ్‌ సింగ్‌  మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నాయకుడైన ఖర్గే మాకు మద్దతుగా ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఖర్గే మద్దతు కోరాను’ అని తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పట్ల తిహాడ్‌ జైలు అధికారులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలిపానని సింగ్ చెప్పారు. 

సమావేశంలో పలు అంశాలపై చర్చించామన్నారు. దేశ రాజ్యాంగంలో తలెత్తుతున్న సంక్షోభం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరుపై చర్చించామన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉమ్మడి కార్యక్రమం నిర్వహించాలనే ప్రతిపాదన చేశానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని