Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా సామూహిక నిరాహార దీక్షలు

Kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది.

Published : 07 Apr 2024 13:20 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది. దిల్లీలోని జంతర్‌మంతర్‌ దీనికి వేదికైంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమెరికా బోస్టన్‌లోని హార్వర్డ్‌ స్క్వేర్‌, లాస్‌ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌ సైన్‌, వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌, టొరంటో, లండన్‌, మెల్‌బోర్న్‌లోనూ తమ మద్దతుదారులు దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నాయి.

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌ స్వగ్రామంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ దీక్షకు కూర్చుకున్నట్లు ఆప్‌ (AAP) తెలిపింది. దిల్లీలో దీక్ష చేపట్టినవారిలో అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌, డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిలా, మంత్రులు ఆతిశీ, గోపాల్‌ రాయ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ ఉన్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆప్‌ దిల్లీ శాఖ అధ్యక్షుడు గోపాల్‌ రాయ్‌ పిలుపునిచ్చారు. దిల్లీ ఎక్సైజ్‌ విధానానికి సంబంధించిన కేసులో సీఎంను ఇరికించడం భాజపా కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. ఏప్రిల్‌ 15 వరకు కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు