AAP: కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7న ఆప్‌ నేతల నిరాహార దీక్ష

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు  ఆ పార్టీ నేత, కేబినెట్ మంత్రి  గోపాల్ రాయ్ తెలిపారు.

Updated : 03 Apr 2024 21:34 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద ఆమ్ఆద్మీ పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత, కేబినెట్ మంత్రి  గోపాల్ రాయ్ తెలిపారు.  విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రజలు దిల్లీ సీఎం అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే  ఏప్రిల్ 7న నిరాహార దీక్షలో పాల్గొనండి. మీరు ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా సామూహిక నిరాహార దీక్షల్లో పాల్గొనవచ్చు. ఆప్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఆప్ పార్టీ అగ్రనాయకులను అరెస్టు చేస్తోంది’’ అని రాయ్ అన్నారు.

ఏప్రిల్ 7న దిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీసు బేరర్లు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారని రాయ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వ్యాపారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని