Atishi: దిల్లీ మంత్రి ఆతిశీకి ఈసీ నోటీసులు

భాజపాపై చేసిన ఆరోపణలకు గాను దిల్లీ మంత్రి అతిశీ(Atishi)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 

Published : 05 Apr 2024 15:17 IST

దిల్లీ: దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. భాజపాలో చేరాలని తనకు ఆఫర్ వచ్చిందని, చేరకుంటే తనను అరెస్టు చేస్తామని ఆ పార్టీ నాయకులు బెదిరించారని ఆమె ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శనివారం సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

ఈ నెల 2న ఆతిశీ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని.. చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరింది. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని