Chandrababu: చంద్రబాబును కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకుర్‌

తెదేపా అధినేత చంద్రబాబును మాజీ డీజీపీ ఆర్పీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 07 Jun 2024 06:43 IST

ఉండవల్లి నివాసంలో నూతన ఎమ్మెల్యేలు, ఎంపీల సందడి

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అభినందిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. చిత్రంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును మాజీ డీజీపీ ఆర్పీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండవల్లి నివాసానికి చేరుకుని చంద్రబాబు, నారా లోకేశ్‌లను విడివిడిగా కలిశారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఎన్డీయేను అఖండ విజయం వైపు నడిపించినందుకు వారు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. డిక్లరేషన్‌ ఫాంలను ఆయనకు చూపించి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబును కలిసిన వారిలో నందమూరి బాలకృష్ణ, బొండా ఉమామహేశ్వరరావు, పుట్టా సుధాకర్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోండ్రు మురళీమోహన్, పులివర్తి నాని, కాలువ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వరదరాజులురెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్‌ దంపతులు, టీజీ భరత్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్, పెమ్మసాని చంద్రశేఖర్, కేశినేని చిన్ని, వెలగపూడి రామకృష్ణ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పలువురు ఎస్సీ నాయకులతో కలిసి చంద్రబాబును సత్కరించారు. 

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సచివాలయ ఉద్యోగులు

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కూడా..

తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లను ఉండవల్లి నివాసంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు గురువారం వేరువేరుగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు