Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం

విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం తెలిపారు. 

Updated : 23 Jan 2024 18:46 IST

అమరావతి: విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. తాజాగా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని