Adinarayana reddy: వివేకా హత్య వెనుక ఆ జంట ఉంది: ఆదినారాయణరెడ్డి

వివేకా హత్య కేసును సీబీఐ 90 శాతం ఛేదించిందని.. మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపిస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 06 Jun 2024 08:59 IST

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: వివేకా హత్య కేసును సీబీఐ 90 శాతం ఛేదించిందని.. మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపిస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్య వెనకాల ఓ జంట ఉందని.. లోతైన విచారణ జరిగితే వారి పేర్లు బయటకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇంత వరకు రాష్ట్రంలో భారతిరెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. ప్రజలకు 25 శాతం డబ్బులు పంచి మిగతాది జగన్‌ తన ఖాతాలో వేసుకున్నారన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడికత్తి, వివేకా హత్య కేసులపై జగన్‌ను ప్రశ్నిస్తానని తెలిపారు. భూపేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని