Congress: గహ్లోత్‌ నోట ఆ మాటలు అస్సలు ఊహించలేదు: కాంగ్రెస్‌

మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌పై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. 

Updated : 25 Nov 2022 15:14 IST

దిల్లీ: సచిన్‌ పైలట్‌ ద్రోహి, సీఎం పదవికి అనర్హుడంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. సీఎం పీఠం కోసం పైలట్‌, గహ్లోత్‌ మధ్య కొన్నేళ్లుగా పేచీ నడుస్తోంది. ఈ విమర్శలతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 

‘ఇంటర్వ్యూలో గహ్లోత్‌ వాడిన తీవ్రపదజాలం అస్సలు ఊహించలేదు. మేమంతా ఒక కుటుంబం. మాకు పైలట్‌, గహ్లోత్ ఇద్దరూ కావాలి. ఆ అభిప్రాయభేదాలు సమసిపోతాయి. కానీ ఆయన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యపర్చాయి. విషయం ఏదైనా.. ఇక్కడ వ్యక్తుల కంటే సంస్థే ఉన్నతమైంది’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.

మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌పై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పైలట్‌ను విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించిన గహ్లోత్‌.. అలాంటి వ్యక్తితో సీఎం స్థానాన్ని భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు ప్రయత్నించారంటూ మండిపడ్డారు. మరోపక్క మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సచిన్‌ పైలట్‌.. అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. తనలాంటి సీనియర్‌ నేతపై అలాంటి భాషను వాడటం సరికాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని