AAP: జూన్ 4తర్వాత భాజపా నేతలు జైలుకే: ఆప్‌ నేత ఆతిశీ

భాజపా నేతలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కమలనాథులకు జైలు తప్పదని పేర్కొన్నారు. 

Published : 22 May 2024 12:35 IST

దిల్లీ: జూన్ 4న ‘ఇండియా’ కూటమి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమ్ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ ఆతిశీ (Atishi) అన్నారు.  అనంతరం ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds)లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి భాజపా (BJP) నాయకులను, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను జైలుకు పంపుతామని ఆమె పేర్కొన్నారు.  

దిల్లీలో ఆతిశీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దేశ ప్రజలు భాజపా ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయించుకున్నారు. జూన్ 4 తర్వాత మా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంలో భాజపా నేతలే కాదు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కూడా జైలుకు వెళ్లనున్నారు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం కూడా ఉంది’’ అని తెలిపారు.

మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై ఆతిశీ మాట్లాడుతూ తాము హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అయితే ప్రస్తుతం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవపూర్వకంగానే విభేదిస్తున్నామని తెలిపారు.  మద్యం కుంభకోణం ఆప్‌పై భాజపా చేసిన రాజకీయ కుట్రగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల్లో తమ పార్టీని ఓడించలేమని తెలిసిన భాజపా ఈడీ, సీబీఐని ఉపయోగిస్తోందన్నారు. రాష్ట్రంలో మే25న ఓటింగ్‌ జరగనుండగా ఆప్‌ ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలో భాగంగా భాజపా దిల్లీకి యమునా నీటి సరఫరాను సైతం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు