Devendra Fadnavis: ఉప ముఖ్యమంత్రి పదవిని వీడాలనుకుంటున్నా

మహారాష్ట్రలో భాజపాకు సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉప ముఖ్యమంత్రి పదవిని వీడేందుకు సిద్ధమయ్యారు.

Published : 06 Jun 2024 04:23 IST

మహారాష్ట్ర భాజపా అగ్రనేత ఫడణవీస్‌ వ్యాఖ్య 

ముంబయి: మహారాష్ట్రలో భాజపాకు సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉప ముఖ్యమంత్రి పదవిని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించుకున్నట్లు ముంబయిలో బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో 2019లో 23 సీట్లు గెల్చుకున్న భాజపా ఈ దఫా 9 స్థానాలకే పరిమితమైంది. ఈ పరాభవానికి సంపూర్ణ బాధ్యత తానే తీసుకుంటున్నట్లు ఫడణవీస్‌ పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం కోసం ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే, మరో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లతో సమన్వయ లేమి కారణంగా తాము కొంత ఇబ్బంది పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫడణవీస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం శిందే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఎన్డీయే సీట్ల తగ్గుదలకు మూడు పార్టీలూ- భాజపా, శివసేన (శిందే వర్గం), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం)- బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు