AIADMK: మేం భాజపాతోనే.. 2024లో కలిసే బరిలోకి..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా(BJP)తో కలిసిపోటీ చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపింది. 

Published : 09 Mar 2023 20:27 IST

చెన్నై: భాజపా(BJP)తో తమ పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే(AIADMK) వెల్లడించింది. 2024 ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని తెలిపింది. ‘తమిళనాడులో ఎన్డీఏ కూటమిని ఏఐఏడీఎంకే నడిపిస్తుంది’ అని ఆ పార్టీ సీనియర్ నేత డీ జయకుమార్ వెల్లడించారు. 

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో ఇరు పార్టీల మధ్య బంధం బీటలు వారేలా కనిపించింది. భాజపాకు చెందిన పలువురు కీలక నేతలు అన్నాడీఎంకే(AIADMK)లో చేరారు. దాంతో ఆ పార్టీ సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదంటూ కమలం నేతలు అన్నాడీఎంకే చీఫ్ ఇ. పళనిస్వామి దిష్టిబొమ్మను తగులబెట్టారు. మరోపక్క భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలై.. తనను తాను మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పోల్చుకోవడం వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాజకీయ నేతలు పార్టీలు మారడం సహజమేనని, తమ పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది భాజపాలో చేరారంటూ విభేదాల వార్తలను అన్నాడీఎంకే తోసిపుచ్చింది. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పరిష్కారం అవుతాయని పేర్కొంది. ఇవి తమ పొత్తుపై ప్రభావం చూపవని అన్నామలై కూడా స్పందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని