Congress: కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం భారాస అధినేత కేసీఆర్‌ ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated : 29 Feb 2024 20:04 IST

హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం భారాస అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేసారని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీచంద్‌ మాట్లాడారు.

‘‘రాష్ట్ర ప్రజలను వంచించి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్‌ ప్రభుత్వం వాడుకోలేదు. ఆయన అసమర్థ నాయకత్వంతో కృష్ణా నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టింది. మరోసారి మోసం చేయడానికే ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు. శుక్రవారం పాలమూరులో గత ప్రభుత్వ బండారం బయటపెడతాం’’ అని వంశీచంద్‌రెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు