YS Jagan - Pinnelli: ‘మా పిన్నెల్లి మంచివాడు’ అంటూ కితాబిచ్చారే.. జగన్‌ ఇప్పుడేమంటారో?

‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు’ అంటూ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ పొగిడేశారు. ఇప్పుడు ఆయన ఏమంటారో?

Updated : 22 May 2024 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నాకు మంచి స్నేహితుడు, మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణా రెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’’ అని మే నెల 6న మాచర్ల (Macharla)లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రంలో అరాచకానికి, దౌర్జన్యానికి దిగిన వీడియోలు బయటకు రావడం, అరెస్టు చేయండి అంటూ ఎన్నికల సంఘం ఆదేశించడంతో.. ‘ఎంతో మంచివాడంటే.. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడి వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఈవీఎంలు ధ్వంసం చేసేవారా?’ అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. ‘‘రామకృష్ణారెడ్డి మీకు మరింత స్నేహితుడు అంటున్నారు. అలాంటి వ్యక్తులే మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదా మరింత పై స్థానం కల్పిస్తానంటూ వెనకేసుకొస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని