నకిలీ ఆడియోల నిలయంగా గహ్లోత్ నివాసం

రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నివాసం ....

Updated : 27 Feb 2024 19:47 IST

(రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేసింది. నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆయనను విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రభుత్వమంతా రిసార్టులో దాచుకోవడం దురదృష్టకరమని పూనియా అన్నారు. ప్రభుత్వానికి నిజంగానే పూర్తి ఆధిక్యత ఉంటే శిబిర రాజకీయాలు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల ప్రతిష్ఠను దిగజార్చాలన్న ఉద్దేశంతో ఎస్‌ఓజీ, ఏసీబీని వాడుకుంటోందని ఆరోపించారు.   

‘రాజస్థాన్‌ రాజకీయాల్లో ఈ రోజు జరిగింది సిగ్గుచేటు. ముఖ్యమంత్రి నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారింది. ఆయన  ఇతర నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలోకి కేంద్ర మంత్రుల్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కుర్చీని కాపాడుకొనేందుకు గహ్లోత్‌ ఎంతకు తెగించేందుకైనా వెనుకాడరు. వారి అంతర్గత కలహాలకు భాజపాను నిందిస్తున్నారు. వాళ్ల గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అంతేకానీ వాళ్ల అంతర్గత విభేదాలకు భాజపా, కేంద్ర నాయకత్వాన్ని ఎందుకు నిందించాలి’ అని పూనియా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు