TS Assembly: హుక్కా పార్లర్లపై నిషేధం.. బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Published : 12 Feb 2024 11:33 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు సభ ముందుకు తీసుకొచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభ దీనికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.

బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘సిగరెట్‌ కంటే హుక్కా పొగ మరింత హానికరం. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారు’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు