Atchannaidu: విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ

విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైకాపా నేతలు దాడి చేసిన ఘటనపై ఏపీ తెదేపా అధ్యక్షుడు ఈసీ, డీజీపీకి డీజీపీకి లేఖ రాశారు.

Updated : 20 May 2024 18:51 IST

అమరావతి: విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, డీజీపీకి తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తివేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఈసీ జోక్యం చేసుకోవడంతోనే పరిస్థితులు అదుపులోకి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఘటనలో బాధితుల గళం వినిపించిన ఈటీవీ, ఏబీఎన్‌ సిబ్బందితో పాటు భాజపా నేత విష్ణుకుమార్ రాజుపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఈసీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖలో హింసను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో అచ్చెన్న కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు