Bandi Sanjay: మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్
భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆరోజు హాజరుకాలేనని తెలిపారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సూచించినట్టుగా ఈనెల 18న హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన కమిషన్ ఎదుట హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్