Bandi Sanjay: కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?: బండి సంజయ్‌

రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు.

Updated : 11 Jan 2024 13:29 IST

కరీంనగర్‌: రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40వేల కోట్లు ఆర్జిస్తోందన్నారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రామమందిర నిర్మాణం భాజపా కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ చెప్పింది. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్‌ విచారణ అంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌ తీరు భారాస నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోంది’’ అని బండి సంజయ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని