Bandi Sanjay: ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌, భారాస పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు.

Updated : 05 Nov 2023 14:50 IST

కరీంనగర్‌: కాంగ్రెస్‌, భారాస పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో సంజయ్‌ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్‌, భారాస వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘బీసీ వర్గమంతా భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారు. బీసీలకు భారాస కేవలం 23, కాంగ్రెస్‌ 19 సీట్లే ఇచ్చాయి. బీసీ నేతలు దిల్లీకి వెళ్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ అవమానపరిచింది. రాష్ట్రంలో దాదాపు 50 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోంది.

భాజపాలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించం. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్‌ భాజపాలో లేదు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను.’’అని బండి సంజయ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని