Bandi sanjay: కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారు: బండి సంజయ్‌

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. 300 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని తేవాలని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేయాలని పరితపించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. 

Updated : 18 Aug 2023 17:58 IST

కరీంనగర్‌: రుణమాఫీ విషయంలో రైతులను భారాస ప్రభుత్వం మోసం చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేయకుండా రూపాయి తగ్గించి.. రూ.99,999 వరకు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.లక్ష తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేయాలని.. అవసరమైతే మిగిలిన ఆ ఒక్క రూపాయిని రైతులే కట్టుకుంటారని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. 300 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని తేవాలని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేయాలని పరితపించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని సీఎం మోసం చేశారని బండి సంజయ్‌ మండిపడ్డారు. దీనిపై నిరసనలు చేస్తున్న భాజపా కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస ఓడిపోతుందనే భయంతోనే ముందస్తుగా మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఆశావహులకు రూ.50 వేలకు కాంగ్రెస్‌ దరఖాస్తులు అమ్ముకుంటోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని