Bandi Sanjay: జగన్ ప్రభుత్వం సాధించింది అప్పులు..అవినీతిలో ప్రగతి: బండి సంజయ్‌

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవినీతి, అప్పులు, అరాచకాల్లో పోటీపడి దోచుకుంటున్నాయని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 21 Aug 2023 18:39 IST

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవినీతి, అప్పులు, అరాచకాల్లో పోటీపడి దోచుకుంటున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓటరు అవగాహన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా హాజరై మాట్లాడారు.

‘‘మళ్లీ అధికారంలోకి రావాలని వైకాపా అడ్డదారులు తొక్కుతోంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి రూ. 10 వేలకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమే. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఏపీ. ఇదే వైకాపా గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పింది. మరి ఆ హామీ ఏమైందో వారే చెప్పాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని