Bandi sanjay: డబుల్ ఇంజిన్ సర్కార్ కారును తుక్కు తుక్కు చేస్తుంది: బండి సంజయ్‌

కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటుందో దేశమంతా చూస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Published : 11 Aug 2023 17:13 IST

హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా దోచుకుంటుందో దేశమంతా చూస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా వారు చూస్తున్నారు. అందుకే మీరు వణికిపోతున్నట్టున్నారు. పైకి శత్రువుల్లాగా నటిస్తూ దిల్లీలో మాత్రం కాంగ్రెస్‌, ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్టే. ఆర్టీసీ కార్మికులను ఇన్ని రోజులు విస్మరించిన సర్కార్‌.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేసింది. 

ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదు. రైతులు, యువత, 317 జీవో ద్వారా టీచర్లు ఇబ్బందులు పడినా ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఎందుకివ్వలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు మీరు ఎందుకు సహకరించడంలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఇంకెన్ని అబద్ధాలు చెబుతారు. మోదీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ మీ కారును తుక్కు తుక్కుగా చేస్తుంది’’ అని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని