Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోండి: సీఎంకు బండి సంజయ్‌ లేఖ

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

Updated : 17 Jan 2024 18:24 IST

కరీంనగర్‌: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. బతుకమ్మ చీరల బకాయిలు రూ.220 కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడంవల్లే ఈ దుస్థితి వచ్చింది. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే బకాయిలు చెల్లించండి. ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలి. ‘వర్కర్‌ టు ఓనర్‌’ పథకానికి నిధులు మంజూరు చేసి సంపూర్ణంగా అమలు చేయాలి. మరమగ్గాల ఆధునికీకరణకు అవసరమైన నిధులు కేటాయించండి. మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళతా’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని