Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని పరుగులెత్తించా: బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

Updated : 06 Nov 2023 15:03 IST

కరీంనగర్‌: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఆయన కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో భాజపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు. 

ర్యాలీలో సంజయ్‌ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు.

‘‘రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారు. నాపై మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో భాజపా కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి’’ అని సంజయ్‌ పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని