Bandi Sanjay: సిరిసిల్ల జిల్లాలో టెట్ ప్రశ్నపత్రం మార్పు.. బండి సంజయ్‌ ఆగ్రహం

టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి అందజేసి నిరుద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. 

Updated : 15 Sep 2023 22:08 IST

హైదరాబాద్‌: టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి అందజేసి నిరుద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతగాని సర్కార్ రాష్ట్రంలో కొనసాగుతుండటం బాధాకరమన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ ఉదంతం మరువకముందే టెట్ ప్రశ్నపత్రం మార్పు పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రతిపక్షాలపై బురద జల్లుతూ రాజకీయ పబ్బం గడిపే మంత్రి కేటీఆర్‌.. సొంత జిల్లాలో అధికారులు చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని సంజయ్‌ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని