Bandi Sanjay: ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని?: బండి సంజయ్‌

ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 03 Mar 2024 19:49 IST

హుజూరాబాద్‌: ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే.. అధికారం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు.

‘‘నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తారా? లేక గత ప్రభుత్వంలో సాదాసీదాగా నిర్మించిన రెండు పడకల గదులు ఇస్తారా? ప్రజాపాలన సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్ని? మీరిచ్చేవి ఎన్ని? హామీలు నెరవేస్తారనే కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేశారు. కానీ, అధికారంలోకి రాగానే ఆ పార్టీ మాట మారుస్తోంది. షరతుల పేరుతో హామీల్లో కోతలు పెడుతోంది. వెయ్యి మందిని పెళ్లికి పిలిచి 10 మందికే అన్నం పెడతానంటే ఎలా? 100 రోజుల్లోపు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. లేదంటే కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల చేతిలో పరాభవం తప్పదు’’ అని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని