Bandi Sanjay: ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై చర్చ జరగలేదు: బండి సంజయ్‌

పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారంటూ విమర్శించారు.

Updated : 19 Aug 2023 17:01 IST

కరీంనగర్‌: పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారు. దిశ కంటే దారుణమైన ఘటన ఇది. భారాస మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారు. బాలిక కేసులో సీఎంవో నుంచి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. దివాళా తీసిన సర్కారు ఖజానా కోసమే ముందస్తు మద్యం టెండర్లు అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను భాజపా అడ్డుకోదని స్పష్టం చేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని బండి సంజయ్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని