Bandi Sanjay: అధిష్ఠానం ఆదేశిస్తే కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తా: బండి సంజయ్‌

ఆదిలాబాద్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగర్జన సభకు విపరీతమైన స్పందన వచ్చిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

Published : 11 Oct 2023 15:32 IST

కరీంనగర్: ఆదిలాబాద్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగర్జన సభకు విపరీతమైన స్పందన వచ్చిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు అనుకూల వాతావరణం ఉందని.. భాజపా గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారాసను ఎదుర్కొనే సత్తా భాజపాకు మాత్రమే ఉందన్నారు. అలా ప్రజలు భావించడం వల్లే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఆదరించారన్నారు.
కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ భారాస ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

‘‘కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. నిధులు కేంద్రానివి.. సోకులు రాష్ట్రానివి. ధాన్యం కొనేది కేంద్రం. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్రం అబద్ధాలు చెబుతోంది. ఉపాధి హామీ డబ్బులు కూడా మావేనని భారాస నేతలు ప్రచారం చేసుకున్నారు. రైతులు పంట నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదు? అభివృద్ధి చేస్తున్నది.. చేసేది భాజపానే. భారాసకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. భారాస అవినీతి, అరాచకాలు, కబ్జాలు చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. భారాస అధికారంలోకి వస్తే రూ. 5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు.. రూ. 10 లక్షల కోట్లు అవుతుంది. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుంది?కరీంనగర్‌లో పోటీ చేయాలని ఉందని నా కోరిక చెప్పా. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా’’ అని బండి సంజయ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని