Bandi Sanjay: గ్రూప్‌-1 అన్నారు.. అధికారంలోకి రాగానే మర్చిపోయారు: బండి సంజయ్‌

మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చాలని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Published : 02 Feb 2024 21:29 IST

హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని భాజపా (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.  ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట తప్పుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇవాళ ఫిబ్రవరి 2 ఆ ప్రస్తావనే లేదు. కనీసం నోటిఫికేషన్ అయినా ఇవ్వలేదు. మీరు ఎంతో పవిత్రంగా భావిస్తాం అని చెప్పే మేనిఫెస్టోను మీరే అమలు చేయకపోతే ఎలా? కేవలం ఎన్నికల వరకు మాత్రమే మేనిఫెస్టో మీకు పవిత్ర గ్రంథమా? ఎన్నికలయ్యాక కాదా? ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని