రేవంత్‌ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్‌ చెప్పిన బండ్ల గణేశ్‌

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని తాను నెలరోజుల క్రితమే చెప్పానని.. అదే నిజమైందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) అన్నారు.

Updated : 06 Dec 2023 16:09 IST

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని తాను నెలరోజుల క్రితమే చెప్పానని.. అదే నిజమైందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) అన్నారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీఎం అవుతారని ముందే ఎలా అంచనా వేశారని ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఎల్బీ స్టేడియంలో ఈనాడు-ఈటీవీ ప్రతినిధితో బండ్ల గణేశ్‌ మాట్లాడారు.

‘‘పోరాడేవారికే కత్తి ఇస్తారు.. కత్తి ఇచ్చేవారికే కిరీటం కూడా ఇస్తారు. దీనిలో పెద్ద లాజిక్కేం లేదు. రేవంత్‌ రెడ్డి పడిన కష్టం.. మాటతీరు.. జనంలోకి చొచ్చుకెళ్లిన విధానం చూసి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం.. వచ్చింది. కాంగ్రెస్‌ పాలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. రేవంత్‌ నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది’’ అని బండ్ల గణేశ్ అన్నారు.

ఇకపై కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. తానెప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడినేనని బండ్ల గణేశ్‌ చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నందున ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నట్లు తెలిపారు. ‘‘2004 నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాను. నేను కాంగ్రెస్‌ వాదిని.. అది ప్రపంచానికి తెలిసిన నిజం. మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని