Bhatti Vikramarka: విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి.. మాపై విమర్శలా?: భట్టి

కమీషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్‌ రంగాన్ని గత భారాస ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.

Updated : 14 Apr 2024 16:34 IST

ఖమ్మం: విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్‌.. చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్‌ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. ‘‘ఒక్క గంట కూడా కరెంట్‌ పోకుండా సరఫరా చేస్తున్నాం. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్లలో అవినీతికి పాల్పడ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించారు. విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి.. తిరిగి మాపై విమర్శలు చేస్తారా’’ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని