Bhatti Vikramarka: ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బడ్జెట్‌ అంచనాలకే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Published : 06 Jan 2024 15:40 IST

ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో (Praja Palana) పాల్గొన్న ఆయన.. దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చాం. రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాం. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బడ్జెట్‌ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు