Mallu Bhatti Vikramarka: అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

Published : 28 May 2024 04:03 IST

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క

ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క

హైదరాబాద్, న్యూస్‌టుడే: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మోదీ సర్కారును బిలియనీర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ‘‘విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లను మోదీ   ప్రైవేట్‌పరం చేసి దేశం పరువుతీశారు. భారత్‌లో పెరిగిపోయిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతికి భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణను చూసి మోదీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే విపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల వేళ గత పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని.. మతం, మంగళసూత్రం వంటి వ్యాఖ్యలు చేయడం  దురదృష్టకరం. మోదీ ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారు’’ అని భట్టి మండిపడ్డారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని