BJP List: లోక్‌సభ బరిలో కంగన.. 111 మంది అభ్యర్థులతో భాజపా ఐదో జాబితా ఇదే..

లోక్‌సభ ఎన్నికలకు భాజపా ఐదో జాబితా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 111 సీట్లకు భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది.

Published : 25 Mar 2024 00:09 IST

BJP Candidates List| దిల్లీ:  లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసేందుకు భాజపా (BJP) ఐదో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. 17 రాష్ట్రాల్లో 111 స్థానాలకు అభ్యర్థులతో ఈ జాబితాను ఖరారు చేసింది. ఏపీలో 6 స్థానాలకు, తెలంగాణ 2, బిహార్‌లో 17, గోవాలో 1, గుజరాత్‌ 6, హరియాణా 4, హిమాచల్‌ప్రదేశ్‌ 2, ఝార్ఖండ్‌ 3, కర్ణాటక 4, కేరళ 4, మహారాష్ట్ర 3, మిజోరం 1, ఒడిశా 18,  రాజస్థాన్‌ 7, సిక్కిం 1, ఉత్తర్‌ప్రదేశ్‌ 13, పశ్చిమబెంగాల్‌ 19 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు నాలుగు జాబితాలుగా 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా పార్టీలో చేరిన నవీన్‌ జిందాల్‌, సీతా సోరెన్‌లతో పాటు పలువురు కేంద్రమంత్రులు, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్‌ గంగోపాధ్యాయ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, రామాయణ్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌లకు చోటు దక్కింది. యూపీలోని పిలిభిత్‌లో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వరుణ్‌ గాంధీని తప్పించి.. యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదను ఆ సీటు నుంచి బరిలో దించింది. దీంతో ఇప్పటివరకు భాజపా ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 402కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే..

  • తెలంగాణలోని మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి ఆరూరి రమేశ్‌, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావు బరిలో దించుతున్నట్లు ప్రకటించారు.

ఏపీలో పోటీ చేసే అభ్యర్థులు..

  • అరకు : కొత్తపల్లి గీత; అనకాపల్లి: సీఎం రమేష్; రాజమహేంద్రవరం: పురందేశ్వరి; నర్సాపురం: భూపతిరాజు శ్రీనివాస వర్మ; తిరుపతి (ఎస్సీ): వరప్రసాదరావు; రాజంపేట: కిరణ్ కుమార్ రెడ్డి

బరిలో కొందరు ప్రముఖులు

కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ - ఉజియర్‌పుర్‌(బిహార్‌); గిరిరాజ్‌సింగ్‌ - బెగుసరాయి(బిహార్‌); రవిశంకర్‌ ప్రసాద్‌ - పట్నా సాహిబ్‌ (బిహార్‌); సుల్తాన్‌పుర్‌ - మేనకా గాంధీ (ఉత్తరప్రదేశ్‌), కంగనా రనౌత్‌ - మండి (హిమాచల్‌ప్రదేశ్‌); నవీన్‌ జిందాల్‌ - కురుక్షేత్ర (హరియాణా); సీతా సోరెన్‌ - డుమ్కా (ఝార్ఖండ్‌); జగదీష్‌ షెట్టర్‌ - బెళగావి (కర్ణాటక); కె. సుధాకరన్‌ - చిక్కబళ్లాపూర్‌ (కర్ణాటక); ధర్మేంద్రప్రధాన్‌ - సంబల్‌పుర్‌ (ఒడిశా); ప్రతాప్‌ సారంగి - బాలాసోర్‌ (ఒడిశా); సంబిత్‌ పాత్రా - పూరి (ఒడిశా); అపరజిత సారంగి - భువనేశ్వర్‌ (ఒడిశా); అరుణ్‌ గోవిల్‌ -మేరఠ్‌ (ఉత్తరప్రదేశ్‌), రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ - సరన్‌ (బిహార్‌), కె. సురేంద్రన్‌ -వయనాడ్‌ (కేరళ) నుంచి బరిలో నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని