Counting: తెలంగాణలో భాజపా అభ్యర్థుల ఆధిక్యం.. ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీగా లీడ్‌

తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 17 లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. వరంగల్‌లో ఆరూరి రమేశ్ 242 ఓట్లు (భాజపా) ఆధిక్యంలో ఉన్నారు.

Updated : 04 Jun 2024 11:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 17 లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. భాజపా తరఫున పోటీ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), గోడం నగేశ్‌ (ఆదిలాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్‌ నగర్), భరత్‌ ప్రసాద్‌ (నాగర్‌ కర్నూల్‌) ఆధిక్యంలో ఉన్నారు. 

రఘురామిరెడ్డికి 55వేలకుపైగా ఆధిక్యం

ఖమ్మం లోక్‌సభ స్థానంలో రఘురామిరెడ్డి (కాంగ్రెస్)  1,48,091  ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్‌ షెట్కార్ (జహీరాబాద్‌), చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), రఘువీర్‌ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్‌) కాంగ్రెస్ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యం కనబరుస్తున్నారు. భారాస మెదక్‌ స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని