Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి: రఘునందన్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని భాజపా నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Updated : 26 Mar 2024 17:46 IST

సంగారెడ్డి: ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని భాజపా నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘గతంలో రేవంత్‌రెడ్డిని టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా అరెస్టు చేశారు. 2014 నుంచి వ్యవహారం జరిగినట్టు అర్థమవుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినప్పుడు డీజీపీ, ఎస్‌ఐబీ చీఫ్‌గా ఎవరున్నారు. గత డీజీపీ పీఏ అధికారిక ఖర్చులతో, కార్యాలయ సిబ్బంది శ్రీనాథ్‌రెడ్డి అమెరికా ఎలా వెళ్లారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు ఎవరు, ఎప్పుడు, ఎలా కొన్నారు? ఈకేసులో ఇద్దరు అడిషినల్‌ ఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకొంటామంటే కుదరదు. చిత్తశుద్ధితో విచారణ జరపాలి. ఈకేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్‌, రెండో నిందితుడిగా హరీశ్‌రావు, మూడో ముద్దాయిగా వెంకట్రామిరెడ్డిని పెట్టాలి. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలి’’ అని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని