Eatala: విద్యావ్యవస్థను కేసీఆర్‌ సర్కారు నిర్వీర్యం చేసింది: ఈటల రాజేందర్‌

విద్యా వ్యవస్థ మొత్తాన్ని కేసీఆర్‌ సర్కారు నిర్వీర్యం చేసిందని భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. 

Updated : 23 Jul 2023 18:04 IST

హైదరాబాద్‌: విద్యా వ్యవస్థ మొత్తాన్ని కేసీఆర్‌ సర్కారు నిర్వీర్యం చేసిందని భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా  తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఆత్మగౌరవం కోల్పోయారని అన్నారు. ‘‘ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల స్థానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చారు. పేదవాడికి విశ్వవిద్యాలయం విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకే టీచర్‌ అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది పోలీసు శాఖలోనే. పోలీసులు అవినీతి పరులకు రక్షణగా నిలిచారు.

వ్యాపారవేత్తలకు చౌకగా భూములు కట్టబెట్టేందుకు ధరణి తీసుకొచ్చారు. దళితులకు మూడెకరాల భూమి దేవుడెరుగు..ఉన్న భూములు గుంజుకున్నారు. ప్రతి తెలంగాణ బిడ్డపై కేసీఆర్‌ అప్పు మోపారు.  మేధావులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలతో మేధోమథనం జరిగింది. వచ్చే నెల 6న ప్రజా సమస్యల సమాచారాన్ని బుక్‌లెట్‌ రూపంలో తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేస్తాం’’ అని ఈటల రాజేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని