Telangana News: హైకోర్టు ఆదేశాలను సభాపతి పక్కన పెట్టారు: భాజపా ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో తమపై సస్పెన్షన్‌ ఎత్తివేసే విషయంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించలేదని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. భాజపా

Updated : 23 Feb 2024 11:58 IST

హైదరాబాద్‌: అసెంబ్లీలో తమపై సస్పెన్షన్‌ ఎత్తివేసే విషయంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించలేదని భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సభాపతి స్థానంలో ఉన్నవాళ్లు రాజకీయ వివక్ష చూపరాదనే నైతిక విలువను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సభాపతి పక్కన పెట్టారని.. ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారు. తమ గళాన్ని బడ్జెట్ సమావేశాల్లో వినిపించకుండా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యకు నిరసనగా ఈనెల 17న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ‘‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి - నియంతృత్వాన్ని బొందపెట్టండి’’ అనే నినాదంతో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. హైకోర్టు తీర్పు పూర్తి ప్రతి రాగానే సుప్రీం కోర్టుకు వెళ్తామని.. న్యాయపోరాటం కొనసాగిస్తామని భాజపా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని