భారాసతో పొత్తు.. అది ఎప్పటికీ జరగదు: బండి సంజయ్‌

భారాసతో భాజపా పొత్తు ఎప్పటికీ ఉండదని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. 

Updated : 20 Feb 2024 17:04 IST

తాండూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు. ‘‘భాజపా వెనుక రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారు. భారాసతో పొత్తు ఉంటుందని భాజపాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోంది. అది ఎప్పటికీ జరగదు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు భాజపాను 370 స్థానాల్లో గెలిపించాలి’’ అని బండి సంజయ్‌ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని